ప‌రిమిత పాత్ర‌పై క్లారిటీ ఇచ్చిన ప‌రిణితీ చోప్రా

Sat,March 23, 2019 10:41 AM
Parineeti Chopra Opens Up on  small role

అక్ష‌య్ కుమార్, ప‌రిణితి చోప్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనురాగ్ సింగ్ తెర‌కెక్కించిన చిత్రం కేస‌రి. రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. అక్ష‌య్ కుమార్ వ‌న్ మ్యాన్ షోకి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. కేస‌రి చిత్రం1897 సెప్టెంబ‌ర్ 12 జ‌రిగిన స‌ర‌గ‌ర్హి అనే మ‌హాసంగ్రామం నేప‌థ్యంలో తెర‌కెక్కింది. హవల్దార్‌ ఇషార్‌ సింగ్ అనే సిక్కు పాత్ర‌లో అక్ష‌య్ న‌టించారు. బ్రిటీష్ పాల‌నలో మ‌న‌దేశం ఉండ‌గా, ఆఫ్ఘ‌నిస్తాన్ నుండి సుమారు ప‌దివేల మంది సైనికులు మ‌న‌పై దండెత్తి వ‌చ్చారు. వారిని భార‌త సైన్యంలోని 21 మంది సిక్కు సైనికులు నిలువ‌రించారు.

శ‌త్రువుల‌ని ఏరిపారేస్తూ వీర‌మ‌ర‌ణం పొందిన వారి త్యాగాల‌ని అందరికి తెలిసేలా చేయాల‌ని అక్ష‌య్ కేస‌రి సినిమా చేశాడు. అయితే ఇందులో క‌థానాయిక‌గా న‌టించిన ప‌రిణితీ చోప్రా ఓ పాట‌కి మాత్ర‌మే ప‌రిమితం కాగా, ఆమెకి డైలాగ్స్ కూడా లేవు. దీంతో అంద‌రు ప‌రిణితీని ఈ సినిమా ఎలా ఒప్పుకున్నావు అని ప్ర‌శ్నించారు. దీంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా స‌మాధానమిచ్చింది ప‌రిణితీ. నాకు మెసేజ్ చేసిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు. మీ ప్రేమ‌కి నేను కృత‌జ్ఞురాలిని. కేస‌రి చిత్రంలో న‌టించాల‌ని మాత్ర‌మే నేను అనుకున్నాను త‌ప్ప నా స్క్రీన్ టైం ఇంత అంత అని ఏం ఆలోచించ‌లేదు. ఈ చిత్రం నాకు చాలా స్పెష‌ల్. ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి కృత‌జ్ఞ‌త‌లు అని ప‌రిణితీ త‌న ట్వీట్‌లో తెలిపింది.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles