క్రికెటర్ తో ఎఫైర్ పై స్పందించిన హీరోయిన్

Fri,September 8, 2017 08:52 AM
PARINEETI CHOPRA responds on her love matter

ఈ మధ్య ఓ ఫోన్ విషయంలో హార్ధిక్ పాండ్యా, పరిణితీ చోప్రాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిన సంగతి విదితమే.దీనిపై నెటిజన్స్ ఎవరికి తోచినట్టు వారు ఊహించుకున్నారు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న అనుష్క- కోహ్లీల మాదిరిగా, హార్ధిక్-పరిణితీలు కూడా ప్రేమాయణం నడిపిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై మీడియా పరిణితీని ప్రశ్నించింది. ఓ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన క్రమంలో మీడియా ప్రతినిధులు పరిణితీని హార్ధిక్ తో ప్రేమ విషయంపై ప్రశ్నించగా, ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నానా లేదా అనేది అనవసరం కాని హార్ధిక్ తో మాత్రం డేటింగ్ లో లేను అనే విషయాన్ని కుండ బద్దలు గొట్టినట్టు చెప్పింది. దీంతో అభిమానులలో ఉన్న అనుమానాలకు పులిస్టాప్ పడింది. పరిణితీ ఇప్పటి వరకు భారీ హిట్స్ సాధించకపోయిన ,రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ అలరిస్తుంది.

4614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles