కోర్టులో చెమటలు కారుస్తున్న ప‌రిణితీ చోప్రా

Sun,April 7, 2019 08:11 AM
Parineeti Chopra sweats it out on court

అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అమోల్ గుప్తే తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ని ముందుగా టైటిల్ రోల్‌కి ఎంపిక చేసారు. సైనా పాత్ర కోసం శ్ర‌ద్ధా క‌పూర్ కొన్ని నెల‌ల పాటు శిక్షణ పొందిన సంగ‌తి తెలిసిందే. అయితే శ్రద్దాకి సడన్ గా డెంగీ సోకడం, కోలుకున్న తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ కావడంతో శ్రద్దా స్థానంలో ప‌రిణితీ చోప్రాని ఎంపిక చేసారు. ఈ సినిమా కోసం పరిణీతీ చోప్రా ట్రైనింగ్‌ స్టార్ట్‌ చేశారు. ‘‘ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి రెండు గంటలు వర్కౌట్‌ చేస్తుందట. అంతేకాదు సైనా ఆడిన మ్యాచ్‌లను కూడా చూస్తుందట. సైనా పాత్రకు పూర్తి న్యాయం చేసేలా కష్టపడతాను’’ అని పేర్కొన్నారు పరిణీతీ చోప్రా. ఈ ఏడాది చివ‌రిలో చిత్ర షూటింగ్ పూర్తి చేసి, 2020లో సినిమా రిలీజ్ చేయ‌నున్నారు. కాగా, సైనా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు ప‌తకాలు సాధించిన తొలి భార‌తీయ బ్యాడ్మింట‌న్‌ క్రీడాకారిణిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.3089
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles