కాబోయే బావ‌గారిని 37 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్

Fri,October 19, 2018 09:23 AM
Parineeti to ask for Rs 37 cr from Nick Jonas

మ‌రి కొద్ది రోజుల‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ వేదిక‌గా వివాహం చేసుకుంటార‌ని ప‌లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు జోరుగా న‌డుస్తుండ‌గా, మూడు రోజుల పాటు వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ప్రియాంక చోప్రా సోద‌రి ప‌రిణితీ చోప్రా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాను కాబోయే బావ‌గారిని (నిక్ జోనాస్‌) 37 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేసిన‌ట్టు తెలిపిది. ఉత్త‌రాది పెళ్లి వేడుక‌ల‌లో జుతా చురానా అనే ఆట ఉంటుంది. ఇందులో మ‌ర‌ద‌ళ్ళు బావ వ‌స్తువులు దొంగిలించి అడిగినంత మొత్తం ఇస్తేనే తిరిగి వారి వస్తువులు వారికి ఇచ్చేస్తారు. ఇందులో భాగంగా ప‌రిణితీ ముందుగానే 5 మిలియన్‌ డాలర్లు( సుమారు 37 కోట్లు) డిమాండ్ చేయ‌గా, ఆమె బావ అయిన నిక్ 10 డాల‌ర్లు మాత్ర‌మే ఇస్తాన‌ని అన్నాడ‌ట‌. దీనిపై ఇంకా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. నేను ఎంత అడిగిన ఆయ‌న ఇస్తారు. ఎందుకంటే ఆయ‌న ప్రియ‌మైన మ‌ర‌దలిని నేను అంటూ చెప్పుకొచ్చింది ప‌రిణితీ. వ‌చ్చే నెల‌లో ప్రియాంక‌, నిక్ జోనాస్‌ల వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం .

7160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles