మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం చిత్రలహరి ఏప్రిల్ 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘హలో’ ఫేం కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కిశోర్ తిరుమల తెరకెక్కించారు. చిత్ర రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల చేసిన టీం తాజాగా పరుగు పరుగు అంటూ సాగే పాటని విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటని డేవిడ్ సైమన్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాటకి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ చిత్రంతో అయిన సాయిధరమ్ మంచి సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుతున్నారు. తాజాగా విడుదలైన పాటపై మీరు ఓ లుక్కేయండి.
