ప‌వ‌న్‌కి 40 కోట్ల ఆఫర్.. సందిగ్ధంలో ప‌వ‌ర్ స్టార్‌

Mon,November 13, 2017 05:12 PM

ఆర‌డుగుల బుల్లెట్‌.. ధైర్యం వ‌దిలిన రాకెట్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల‌లో త‌న ప‌వ‌ర్ చూపించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌ను సినిమాల‌కి కాస్త గ్యాప్ ఇవ్వాల‌ని కూడా భావించాడు. అయితే ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న ప‌వ‌న్ ఈ సినిమాని డిసెంబ‌ర్ వ‌ర‌కి పూర్తి చేసి ఆ త‌ర్వాత కంప్లీట్‌గా పార్టీ కార్య‌క‌లాపాల‌పై దృష్టి పెట్టాల‌ని భావిస్తున్నాడు. అందుకోసం ఏ ఎం రత్నం నిర్మాణంలో ఆర్ టీ నీసన్ చేయ‌బోవు సినిమాకి కూడా కాస్త బ్రేక్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ మూవీ ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకోగా, ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంద‌నే దానిపై క్లారిటీ లేదు.


కొన్నాళ్ళు సినిమాల‌కి దూరంగా ఉండి జ‌న‌సేన‌ పార్టీపై పూర్తి దృష్టి పెట్టాల‌ని భావిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మైత్రి మూవీ మేక‌ర్స్ భారీ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. 40 కోట్ల పారితోషికం ఇచ్చి 80 కోట్ల బ‌డ్జెట్‌తో ఓ సినిమా చేయాల‌ని వారు అనుకుంటున్నార‌ట‌. ఈ వార్త ప్ర‌స్తుతం ఫిలిం న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌రి త‌న పార్టీని పూర్తిగా జనాల‌లోకి తీసుకెళ్ళేందుకు కాస్త స‌మ‌యం తీసుకోవాల‌ని కోరుకున్న ప‌వ‌న్‌కి మైత్రి మూవీ మేక‌ర్స్ ఇచ్చిన ఆఫ‌ర్ ఆయ‌న నిర్ణ‌యాన్ని ఏమైన మారుస్తుందా అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విష‌యంలో ప‌వ‌న్ ఎటు తేల్చుకోలేని ప‌రిస్థితిలో ఉన్నాడ‌ని, దాదాపు ఈ ఆఫ‌ర్‌ని కూడా కాద‌ని ప్ర‌జా సంక్షేమం కోసం పూర్తి రాజ‌కీయాల‌లోకి దిగుతాడ‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు. మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంత, అబ‌ద్ద‌మెంత అన్న‌ది తెలియాలి.

4575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles