ఓట‌మి నుండి కోలుకోవ‌డానికి 15 నిమిషాల స‌మ‌యం ప‌ట్టింది: ప‌వ‌న్

Sat,July 6, 2019 10:14 AM

అమెరికా వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తానా 22వ మ‌హాస‌భ‌లు ఘ‌నంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌కి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్ ఎంట్రీతో వేడుక సంద‌డిగా మారింది. తానా వేదిక‌గా ప‌లు విష‌యాలపై ప్ర‌స్తావించిన ప‌వ‌న్ ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్‌లో ఓటమిపై కూడా స్పందించారు. అప‌జ‌యానికి ఎప్పుడు నేను భ‌య‌ప‌డ‌ను. సినిమాల‌లో ఉన్న‌ప్పుడు ఖుషీ త‌ర్వాత చాలా ఫ్లాప్స్ వ‌చ్చాయి. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో మంచి విజ‌యాన్ని పొందాను. దాని కోసం చాలా స‌హ‌నంతో ఓపిక‌గా ఎదురు చూసాను. అలానే రాజ‌కీయాల‌లోను ఏదో ఒక రోజు గెలుపొందుతాను. మొన్న జరిగిన ఎల‌క్ష‌న్స్‌లో ఓడిపోతాను అనే విష‌యం ముందే తెలుసు. సంపూర్ణంగా ఓడిపోయి, అర్ధం చేసుకొని బ‌య‌ట‌కి రావ‌డానికి నాకు 15 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది. 15 నిమిషాలు నా అప‌జ‌యాన్ని నేను ఒప్పుకొన్నాను. స‌క్సెస్ క‌న్నా ఓట‌మి మాత్ర‌మే నాకు పాఠాలు ఎక్కువ నేర్పింది. ఖుషీ 100 డేస్ ఫంక్ష‌న్‌లో స‌మాజం కోసం ఏదైన చేయాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నాను. ఆ రోజు నుండి సినిమాల‌పై ఆస‌క్తి త‌గ్గింది. స‌మాజానికి ఏదో చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అదే మీ ముందుకు జ‌న‌సేన రూపంలో వ‌చ్చింద‌ని ప‌వ‌న్ పేర్కొన్నాడు.

4459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles