అంత‌ర్జాతీయ డ్యాన్స్ షోలో అప్పుడు చిరు పాట‌, ఇప్పుడు ప‌వ‌న్ పాట‌

Tue,May 7, 2019 09:15 AM
Pawan Kalyans sardar Gabbar Singh song goes international

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150లోని సుంద‌రి అనే సాంగ్‌కి ఓ భార‌త డ్యాన్స్ గ్రూప్ అప్ప‌ట్లో పాపుల‌ర్ అమెరిక‌న్ షోలో డ్యాన్స్ చేసింది. ఇప్పుడు చిరు సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్‌లోని వాడెవ‌డన్నా వీడ‌వెడ‌న్నా అనే సాంగ్‌కి అంత‌ర్జాతీయ వేదిక‌పై ‘ది కింగ్స్‌’ అనే భార‌త డ్యాన్స్ గ్రూప్ స్టెప్పులు వేసి అల‌రించింది. ఈ ఆనందాన్ని దేవి శ్రీ ప్ర‌సాద్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా నెటిజన్స్‌తో షేర్ చేసుకున్నాడు. వివ‌రాల‌లోకి వెళితే భార‌త డ్యాన్స్ గ్రూప్ ‘ది కింగ్స్‌’ అంత‌ర్జాతీయ రియాలిటీ ఫినాలో షోలో వాడెవ‌డన్నా వీడెవ‌డ‌న్నా అనే పాట‌కి అదిరిపోయే స్టెప్పుల‌తో అల‌రించారు. షోకి న్యాయ నిర్ణేత‌లుగా ఉన్న జెన్సీఫర్‌ లోపేజ్‌, నీ-యో, డెరెక్‌ హూగ్ వారి డ్యాన్స్‌కి ఫిదా అయ్యార‌ట‌. ఈ డ్యాన్స్ వీడియోను ‘వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ తమ ట్విటర్‌ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. దీనిపై దేవి శ్రీ .. త‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన రెండు సాంగ్స్‌కి అంత‌ర్జాతీయ షోలో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం థ్రిల్లింగ్‌గా ఉంద‌ని పేర్కొన్నారు. ధన్యవాదాలు.. లవ్‌ యు గాయ్స్‌. మీరు ఎంతో చక్కగా డ్యాన్స్‌ చేశారు. కీప్‌ ‘రా‘కింగ్‌’స్‌’ అని ట్వీట్‌లో తెలిపారు దేవి శ్రీ ప్ర‌సాద్.



2974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles