బ‌న్నీ, తేజ్‌ల‌కి ప‌వ‌న్ స్పెష‌ల్ విషెస్

Tue,January 14, 2020 08:00 AM

మెగా హీరోలు సాయిధ‌ర‌మ్ తేజ్‌, అల్లు అర్జున్ ఇటీవ‌ల మంచి సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ప్ర‌తిరోజు పండుగే చిత్రంతో అల‌రించ‌గా, అల్లు అర్జున్.. అల వైకుంఠ‌పురములో చిత్రంతో మంచి వినోదాన్ని అందించాడు. ఈ రెండు చిత్రాల‌కి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రు హీరోల‌కి బొకేలు పంపి శుభాకాంక్ష‌లు తెలిపాడు. దీనిపై స్పందించిన సాయిధ‌ర‌మ్ తేజ్..ల‌వ్ యూ ప‌వ‌న్ మామ అంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ఇక అల్లు అర్జున్.. ‘పవన్ కల్యాణ్ గారి నుంచి అభినందనలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యు పవన్ కళ్యాణ్‌ గారు’’ అని కామెంట్ పెట్టారు.





1149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles