సైరా చిత్రంలో వినిపించ‌నున్న ప‌వ‌న్ స్వ‌రం

Fri,August 16, 2019 10:55 AM
pawan voice for syeraa

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రు క‌లిసి ఒకే ఫ్రేములో క‌నిపిస్తే అభిమానుల ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. శంక‌ర్ దాదా ఎంబీబీఎస్, శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రాల‌లో ప‌వ‌న్ త‌ళుక్కున మెరిసి ప్రేక్ష‌కులని ఉత్తేజ‌ప‌ర‌చాడు. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సుబ్బిరామిరెడ్డి ఓ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని, దానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. కాని ఇప్ప‌టి వ‌ర‌కు దాని ఊసే లేదు. క‌ట్ చేస్తే మెగాస్టార్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరాలో ప‌వ‌న్ వాయిస్ వినిపించ‌నుంది. ప‌వ‌న్ స్వ‌రం మ‌న‌ల్ని చిత్ర క‌థ‌లోకి న‌డిపిస్తుంద‌ట‌.

సైరా టీజ‌ర్ రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైరా చిత్రానికి వాయిస్ ఓవ‌ర్ అందించారు. త‌మ్ముడు భావోద్వేగ స్వ‌రం వినిపిస్తుంటే అన్న‌య్య ప‌క్క‌నే ఉన్నారు. బ్రిటీష్ పాల‌కుల‌ని ఎదిరించి పోరాడిన స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ స‌ర‌సింహారెడ్డి జీవితానికి వెండితెర రూపం క‌లిపించి సైరా చిత్రాన్ని తెర‌కెక్కించారు. చారిత్రక వీరుడి ఘ‌న‌త‌ను ప‌రిచ‌యం చేసే వ్యాక్యాలు ప‌వ‌న్ వాయిస్ ద్వారా మ‌నం విన‌నున్నాం. రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న చిత్రంలో చిరు న‌టించ‌డం, ముఖ్య స‌న్నివేశాల‌కి ప‌వ‌న్ గ‌ళం అందించ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌క‌లోకానికి స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తుంద‌ని అంటున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles