డిస్కోరాజా సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ

Sat,July 27, 2019 08:56 AM

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 4 నుండి ఢిల్లీలో షూటింగ్ జ‌రుపుకోనుంది. ఆ త‌ర్వాత స్విట్జ‌ర్లాండ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. అయితే తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌ చిత్ర టీంతో క‌లిసింది. ర‌వితేజ‌తో క‌లిసి సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది.


ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమ‌వుతున్న ఈ చిత్రంలో RX 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిషోర్ త‌దితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

1021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles