మ‌న్మ‌థుడు2 నుండి పాయ‌ల్ ఔట్..!

Thu,February 21, 2019 01:08 PM
Payal Rajput Not A Part Of This Sequel in manmadhudu 2

నాగార్జున న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో మ‌న్మ‌థుడు ఒక‌టి. కె విజ‌య్ భాస్క‌ర్ దర్శకత్వంలో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంకి సీక్వెల్ తెర‌కెక్క‌నుంద‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం రాహుల్ రవీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు 2 చిత్రం ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండ‌డంతో పాయ‌ల్ రాజ్‌పుత్‌ని ఒక క‌థ‌నాయిక‌గా ఎంపిక చేశార‌ని అన్నారు. కాని ఓ మీడియా సంస్థ‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాయ‌ల్ తాను మ‌న్మ‌థుడు 2 చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌ని ఖండించారు. దీంతో నాగ్ స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై అభిమానుల‌లో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. పాయ‌ల్ ఇప్ప‌టికే ర‌వితేజ డిస్కోరాజా చిత్రంలో ఆఫ‌ర్ కొట్టేయ‌గా, వెంకీ మామ 2లో చైతూతో జ‌త‌క‌ట్ట‌నుంద‌ని సమాచారం.

మార్చి మొదటి వారం నుండి మ‌న్మ‌థుడు2 చిత్రం తొలి షెడ్యూల్ పోర్చుగ‌ల్‌లో జ‌ర‌గ‌నుండ‌గా, ఎక్కువ శాతం చిత్రీక‌ర‌ణ యూర‌ప్‌లో జ‌ర‌ప‌నున్నారని తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందించనున్నాడని సమాచారం. ఆర్ఎక్స్ 100 చిత్ర సంగీతం న‌చ్చ‌డంతో నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

2813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles