ర‌వితేజ స‌ర‌స‌న ఆర్ఎక్స్ 100 భామ‌

Wed,October 31, 2018 12:59 PM

ఆచితూచి అడుగులు వేస్తున్న ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ఇటు తెలుగు, అటు త‌మిళ సినిమాల‌ని సెల‌క్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో ఒకవైపు కోరిక‌తో ర‌గిలిపోతూ, లోలోప‌ల కుట్ర‌లు చేయ‌డం వంటి పాత్ర‌లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఖాతాలో ప‌లు ప్రాజెక్టులు ఉన్నాయ‌ని తెలుస్తుండ‌గా, తాజాగా ర‌వితేజ స‌ర‌స‌న నటించే ఛాన్స్ కొట్టేసింద‌ట‌. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం ‘చిత్రాల దర్శకుడు వి .ఐ ఆనంద్ త్వ‌ర‌లో ర‌వితేజ‌తో ఓ మూవీ ప్లాన్ చేశాడు. నేల టికెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉండ‌గా, ఇందులో ద్విపాత్రిభిన‌యం పోషించ‌నున్నాడ‌ట మాస్ రాజా. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . అయితే ముగ్గురు హీరోయిన్లుకు ప్రాధాన్యం వున్న ఈ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను మరొక హీరోయిన్ గా ఎంపిక చేశారు. మ‌రో హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్‌ని ఎంపిక చేయాల‌నుకుంటున్నార‌ట‌. డిసెంబ‌ర్ నుండి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రంలో సునీల్ కూడా ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు. మూడో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తాడ‌ని అంటున్నారు.

2073
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles