అవార్డు వేడుకలపై దర్శకుడి అసహనం

Fri,March 31, 2017 11:31 AM
Pelli Choopulu Director Disappointed With awards

పురస్కార ప్రధానోత్సవంపై పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అవార్డు వేడుకలు టెలివిజన్ టీఆర్ పీ లు పెంచుకోవడానికి లేదంటే డబ్బులు సంపాదించుకోవడం కోసమే అంటూ తన ఆవేదనని ఫేస్ బుక్ వేదికగా వ్యక్తపరచాడు. కన్నడ అవార్డ్స్ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను.. స్టోరీ, దర్శకత్వం, యాక్టింగ్ ఇలా అన్ని విభాగాలలో ప్రతిభ ఉన్నవారికే వారు అవార్డులిచ్చారంటూ తరుణ్ చెప్పుకొచ్చాడు. క్షణం లాంటి మంచి సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం తనను బాధకు గురి చేసిందని ఈ దర్శకుడు అన్నాడు. బెస్ట్ కామిక్ రోల్ లో దర్శికి అవార్డు రావడం తనని ఎంతో ఆనందానికి గురి చేసిందన్నాడు. ఇంకొన్ని అవార్డులు తన చిత్రానికి వస్తాయని ఈ దర్శకుడు భావించినట్టు తెలిపాడు. అయితే ఐఫా అవార్డు వేడుకలలో పెద్ద సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన తరుణ్ భాస్కర్ చాలా డిజప్పాయినట్టు తెలుస్తుంది.

2405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles