పెళ్లిచూపులు హీరో ఫుల్ బిజీ

Sat,May 27, 2017 03:37 PM
Pelli Choopulu hero busy with different projects

ఈ రోజుల్లో సినిమా ఛాన్స్ రావడం కష్టమేమో కానీ, స్టార్ డమ్ రావడం అంత కష్టం కాదు. ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే చాలు .. కొందరికి అవకాశాలు క్యూ కడతాయి. ఒక్క సినిమాతో స్టార్స్ అయిపోయిన వాళ్లు ఇటీవల మనకు కనిపిస్తారు. ఆ తర్వాత వాళ్లకు కొంత గ్యాప్ వచ్చినా .. లక్ తగిలితే జోరుగా దూసుకుపోతారు. పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ సిట్యుయేషన్ ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాగే ఉంది. 'పెళ్లి చూపులు' సినిమాతో యూత్ లో విజయ్ దేవరకొండకి క్రేజ్ పెరిగి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు తన సెకండ్ మూవీ అర్జున్ రెడ్డి చేస్తున్నాడు విజ‌య్. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, విజయ్ దేవరకొండ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'పెళ్లి చూపులు' నిర్మాతలు నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా, భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తాలూకు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని నిర్మాతలు చెప్పారు. కొత్త హీరోకి ఇలా ఆఫ‌ర్లు రావ‌డం అదృష్ట‌మే మ‌రి

1565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles