కన్నడలోకి రీమేక్ కానున్న తెలుగు చిత్రం

Thu,November 24, 2016 10:05 AM
PELLI CHOOPULU remake in kannada

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం పెళ్ళి చూపులు. డి.సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి(ధ‌ర్మ ప‌థ క్రియేష‌న్స్‌), య‌ష్ రంగినేని(బిగ్ బెన్ సినిమాస్‌) నిర్మించిన ఈ చిత్రాన్ని త‌రుణ్ భాస్క‌ర్ తెరకెక్కించారు. విజ‌య్ దేవ‌ర కొండ‌, రీతూ వర్మ జంటగా రూపొందిన ఈ చిత్రం జూలై 29న విడుద‌లై సూపర్‌హిట్ట‌య్యింది. ఇటు ప్రేక్ష‌కులు, అటు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల నుండి ఈ సినిమాకు మంచి ప్ర‌శంస‌లు దక్కాయి. అయితే పెళ్ళి చూపులు చిత్రాన్ని ఆ మధ్య బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఇదే చిత్రాన్ని తమిళంలో గౌతమ్ మీనన్ రీమేక్ చేయబోతున్నారనే టాక్ నడిచింది. ఇక తాజాగా పెళ్లి చూపులు చిత్రం కన్నడలోకి రీమేక్ కానుందని టాక్ నడుస్తోంది. గురునందన్, శ్రద్ధా శ్రీనాథ్‌లు కన్నడ రీమేక్ లో హీరో హీరోయిన్లుగా నటించనున్నారని తెలుస్తోండగా ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ మురళీ తెరకెక్కించనున్నాడని చెబుతున్నారు. మరి ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

2195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles