ఉత్తమ తెలుగు చిత్రం పెళ్లి చూపులు

Fri,April 7, 2017 12:12 PM
Pelli Choopulu wins the best Telugu Film award in 64th National Film Awards

న్యూఢిల్లీ: 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు నిలిచింది. ఇదే సినిమాకు సంభాషణలు అందించిన తరుణ్ భాస్కర్ కు ఉత్తమ సంభాషణల అవార్డు దక్కడం విశేషం. ఇక జనతా గ్యారేజ్ సినిమాకుగాను కొరియాగ్రఫీ చేసిన రాజు సుందరానికి ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు దక్కింది. మరో తెలుగు సినిమా శతమానంభవతికి ఉత్తమ ప్రజాదరణ చిత్రం అవార్డు దక్కడం విశేషం. ఉత్తమ హిందీ చిత్రం అవార్డును సోనమ్ కపూర్ నటించిన నీర్జా దక్కించుకుంది. ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో జ్యూరీ ఈ అవార్డులను ప్రకటించింది.

జాతీయ చలన చిత్ర అవార్డులు

ఉత్తమ చిత్రం - కాసవ్ (మరాఠీ)
ఉత్తమ నటుడు - అక్షయ్ కుమార్ (రుస్తుం)
ఉత్తమ నటి - సురభి (మిన్నమినుంగు, మలయాళం)
ఉత్తమ దర్శకుడు - రాజేష్ (వెంటిలేటర్)
ఉత్తమ సహాయ నటి - జైరా వసీమ్ (దంగల్)
ఉత్తమ హిందీ చిత్రం - నీర్జా
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం - శివాయ్
ఉత్తమ సామాజిక చిత్రం - పింక్
ఉత్తమ గాయకుడు - సుందర అయ్యర్ (జోకర్, తమిళం)
ఉత్తమ గాయని - ఇమాన్ చక్రవర్తి (ప్రక్తాన్)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ - పీటర్ హెయిన్
ఉత్తమ బాలల చిత్రం - ధనక్ (నగేశ్ కుకునూర్)

తెలుగు సినిమాకు జాతీయ పురస్కారాలు

ఉత్తమ తెలుగు చిత్రం - పెళ్లి చూపులు
ఉత్తమ నృత్య దర్శకుడు - రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ సంభాషణలు - తరుణ్ భాస్కర్ (పెళ్లి చూపులు)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానం భవతి

6362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles