హైదరాబాద్: 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనను అవమానించేలా మూవీలో సన్నివేశాలు ఉన్నాయంటూ పేర్కొంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల నిలిపేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, దర్శకుడు రాంగోపాల్ వర్మ, హాస్యనటుడు రాము తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషన్ పై హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఈ నెల 29న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.