బాలీవుడ్ స్టార్స్‌తో మోదీ భేటీ

Sun,October 20, 2019 08:53 AM

మహాత్మ గాంధీ 150వ జ‌యంత్యుత్స‌వాల‌ని ఘ‌నంగా జ‌రిపేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మాల గురించి చ‌ర్చించ‌డానికి ప్ర‌ధాని మోదీ బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ క‌పూర్, కంగ‌నా ర‌నౌత్, జాకీ ష్రాఫ్ , సోనూ నిగ‌మ్ త‌దిత‌ర సెల‌బ్రిటీల‌ని త‌న అధికార నివాసానికి ఆహ్వానించారు. శ‌నివారం సాయంత్రం అంద‌రు సెల‌బ్రిటీలు మోదీతో భేటీ కాగా ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. ‘గాంధీ ఎట్‌ 150’ ఇతివృత్తంగా తీసిన వీడియోలను ప్రధాని విడుదల చేశారు. 1857 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్య్ర పోరాటం, 1947–2022 కాలంలో దేశాభివృద్ధికి సంబంధించి స్ఫూర్తిదాయక కథనాలపై సినీ, టీవీ పరిశ్రమ దృష్టి సారించాలని వారిని కోరారు. కళారంగంలో చూపిసున్న సృజనాత్మకతను దేశంలో పర్యాటకరంగ అభివృద్ధికి ఉపయోగించాలని వారిని కోరారు మోదీ. అంతేకాక 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దిన వేడుకలపైన చర్చించారు. మోదీ త‌మ‌ని ఆహ్వానించ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన సెల‌బ్రిటీలు కళాకారులుగా దేశానికి మేం చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు.878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles