మ‌హేష్ చ‌నిపోయాడంటూ రూమ‌ర్స్‌.. కొట్టి పారేసిన కూతురు

Sat,September 7, 2019 11:26 AM

బ్ర‌తికున్న వాళ్ళ‌ని చంపేయ‌డం మ‌న గాసిప్ రాయుళ్ళ‌కి కామ‌న్‌గా మారింది. ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌ముఖుల విష‌యంలో త‌ప్పుడు వార్త‌లు పుట్టించిన గాసిప్ రాయుళ్ళు తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్‌ని బ్ర‌తికుండ‌గానే చంపేశారు. గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించార‌ని జోరుగా ప్రచారం చేస్తున్న క్ర‌మంలో మ‌హేష్ భ‌ట్ కూతురు పూజా భ‌ట్ వాటికి చెక్ పెట్టారు. ఆయ‌న‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి మ‌రీ అంద‌రికి క్లారిటీ ఇచ్చింది.


త‌ప్పుడు వార్త‌లు పుట్టించే వారు, నా తండ్రి మ‌హేష్ భ‌ట్ గుండె పోటుతో మృతి చెందార‌ని తెలుసుకొని క‌ల‌త చెందేవారికి ఇదే సాక్ష్యం. ఆయ‌న ఎప్ప‌టిలాగానే ఉత్సాహంగా ఉన్నారు. సంతోషంగా జీవిస్తున్నారు అని త‌న పోస్ట్‌లో తెలిపింది పూజాభ‌ట్. లివింగ్ రూంలో మ‌హేష్‌కి సంబంధించిన రెండు ఫోటోలు కూడా షేర్ చేసింది. కాగా, మ‌హేష్ భ‌ట్ దాదాపు 20 ఏళ్ళ త‌ర్వాత స‌డక్ 2 చిత్రంతో ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ని తీసుకున్నాడు. 1991లో మ‌హేష్ తెర‌కెక్కించిన స‌డ‌క్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది. స‌డ‌క్ చిత్రంలో సంజ‌య్ ద‌త్‌, మ‌హేష్ భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లు పోష‌ఙంచిన సంగ‌తి తెలిసిందే. సీక్వెల్‌లో అలియా భ‌ట్‌, ఆదిత్య రాయ్ క‌పూర్, పూజా భ‌ట్‌, సంజ‌య్ ద‌త్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జూలై 10న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

5357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles