హోట‌ల్ బిల్లు క‌ట్టలేద‌న‌డానికి సాక్ష్యం ఉందా ?

Fri,March 22, 2019 09:07 AM
Pooja Gandhi fires on media

క‌న్న‌డ న‌టి పూజా గాంధీ కొద్ది రోజుల క్రితం బెంగ‌ళూరులోని ల‌గ్జ‌రీ హోట‌ల్‌లో గ‌దిని అద్దెకి తీసుకొని, సుమారు 4.5 ల‌క్ష‌ల బిల్లు క‌ట్ట‌కుండా ప‌రారయ్యిందని ఇటీవ‌ల ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసులకి ఫిర్యాదు చేయ‌డం వ‌లన పూజా రూ.2 ల‌క్ష‌లు చెల్లించింద‌ని, మిగతా మొత్తం చెల్లించ‌డానికి కాస్త స‌మ‌యం కావాల‌ని కోరిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌పై దండుపాళ్యం ఫేం పూజా గాంధీ తాజాగా స్పందించింది. నిజ‌నిజాలు తెలియ‌కుండా హోట‌ల్ బిల్లు ఎగ్గొట్టాను అని ఎలా వార్త‌లు రాస్తారు? అదీ కాక బీజేపీ ఎంపీకు నాకు సంబంధం ఉంద‌ని కూడా ప్ర‌చురించారు. ఇలాంటి వార్త‌ల వ‌ల‌న మేము ఎంత బాధ‌ప‌డ‌తామ‌ని మీరు ఒక్క‌సారి కూడా ఆలోచించ‌రా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది పూజా.

వివ‌రాల‌లోకి వెళితే ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న గురించి మీడియాతో మాట్లాడిన పూజా గాంధీ.. నేను బిల్లు క‌ట్ట‌లేద‌న‌డానికి మీ ద‌గ్గ‌ర ఏమైన సాక్ష్యం ఉందా? అని ప్ర‌శ్నించారు. నేను నిర్మిస్తున్న సినిమాలోని న‌టులు వేరు ప్రాంతాల నుండి రావ‌డం వ‌ల‌న వారికి ప‌లు రూమ్స్ బుక్ చేశాను. వాటికి బిల్లులు కూడా క‌ట్టాను. కాని నేను బిల్లులు క‌ట్ట‌కుండా పారిపోయాన‌ని, హోట‌ల్ యాజ‌మాన్యం నా పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యం గురించి హోట‌ల్ మేనేజ‌ర్‌తో మాట్లాడ‌గా, ఆయ‌న ఏదో త‌ప్పు జ‌ర‌గ‌డం వ‌ల‌న ఇలాంటి వార్త‌లు వ‌చ్చి ఉంటాయ‌ని అన్నారు. అయిన మీరు నేను బ‌స చేసిన హోట‌ల్ లాగ్ బుక్ చూశారా, లేక హోట‌ల్‌కి వ‌చ్చి ఎంక్వైరీ చేశారా, ఏం తెలియ‌కుండా నాపై ఆరోప‌ణ‌లు ఎలా చేస్తారంటూ ఫైర్ అయింది పూజా. భాజాపా ఎంపీ త‌న‌కు సోద‌రుడు వంటి వాడు అని ఈ సంద‌ర్భంగా తెలిపింది.

3404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles