రిలీజ్‌కి ముందే సినిమాపై పాజిటివ్ రివ్యూలు ..!

Wed,October 18, 2017 02:18 PM
positive reviews comes to the aamir secret super star

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాల‌లో ఎంత వైవిధ్యం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాత్ర కోసం అమీర్ చేసే కృషి అనిర్వ‌చ‌నీయం. దంగ‌ల్ సినిమాతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అమీర్ ..అద్వైత్ చౌహాన్ అనే కొత్త దర్శకుడు డైరెక్ష‌న్‌లో సీక్రెట్ సూప‌ర్ స్టార్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అయితే సినిమా విడుద‌ల‌కి ముందే ఈ చిత్రానికి అద్బుత‌మైన రివ్యూలు వ‌స్తున్నాయి. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి ఈ ఏడాది బాలీవుడ్ బెస్ట్ మూవీ సీక్రెట్ సూప‌ర్ స్టార్ అని త‌న‌ తీర్పిచ్చేశాడు. ఇక‌ ఈ సినిమా చూసిన కొంద‌రు త‌మ‌ రివ్యూలతో సినిమాల‌పై అంచ‌నాలు పెంచుతున్నారు. ఆమిర్.. అద్వైత్.. జైరాలపై ప్రశంసల జల్లు కురిపించారు. దంగ‌ల్ చిత్రంలో ఆమీర్ కూతురిగా న‌టించిన జైరా వ‌సీమ్‌ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించింది.

ఓ అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం. కానీ ఆమె తల్లిదండ్రులు తనను ప్రోత్సహించరు. ఈ పరిస్థితుల్లో బురఖా ధరించి.. తనెవరో కనిపించకుండా.. ఓ అజ్ఞాత‌ వ్యక్తిలా యూట్యూబ్ లో తన ప్రతిభను అందరికీ చాటి చెప్పేలా చేస్తుంది. ఈ కథాంశంతో ఎంతో ఇన్ స్పైరింగ్ గా ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందించాడట దర్శకుడట‌ అద్వైత్. ఈ సినిమాతో మ‌రోసారి క‌థ‌లో ఎంపిక‌లో త‌న డెసిష‌న్ కరెక్ట్ అని నిరూపించుకున్నాడ‌ట అమీర్‌.

2583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles