దిగొచ్చిన మికాసింగ్‌.. క్ష‌మాప‌ణ‌లతో నెటిజ‌న్స్ కూల్

Tue,August 20, 2019 10:08 AM
Post ban, Mika Singh wants to apologise to the nation

కశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని రద్దు చేసిన తరువాత భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. పాక్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మ‌న సినిమాల‌తో పాటు క‌ళాకారుల‌ని నిషేదించింది. మ‌రోవైపు బార్డ‌ర్ ద‌గ్గ‌ర దొంగ దాడులు చేస్తుంది. ఈ విష‌యంపై భార‌త్ ప్ర‌భుత్వంతో పాటు భార‌తీయులపై సీరియ‌స్‌గా ఉన్నారు. అయితే ప్ర‌ముఖ గాయ‌కుడు మికా సింగ్ పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు చెందిన సమీప బంధువు ఇంట్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి త‌న టీంతో వెళ్ళాడు. కార్య‌క్ర‌మం పూర్తైన త‌ర్వాత ఇండియాకి తిరిగి వ‌స్తున్న మికా భార‌త్ బోర్డ‌ర్ ద‌గ్గ‌ర భార‌త్ మాతాకీ జై అనే నినాదాలు కూడా చేశాడు.

భార‌త్ - పాక్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న స‌మ‌యంలో మికా సింగ్ పాక్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం ఎవ‌రికి మింగుడుప‌డ‌డం లేదు. పాక్‌తో పాటు భారతీయులు కూడా ఆయ‌న‌పై మండిప‌డ్డారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) అతనిపై నిషేధం విధించింది. దేశంలో పాటలు పాడడం, బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సినిమాల్లో నటించడం పైనా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఎఫ్‌డబ్ల్యూఐసీ ఆదేశాలు కూడా జారీచేసింది. ఈ నేప‌థ్యంలో మికా క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఓ వీడియో విడుద‌ల చేశాడు. నేను తప్పు చేశాను. అందుకు ఈ దేశానికి క్షమాపణలు చెబుతున్నా. నా వాదన వినకుండా తనపై నిషేధం విధించొద్దని ఎఫ్‌డబ్ల్యూఐసీఈకి విన‌తి పంపించిన‌ట్టు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రెసిడెంట్ తెలిపారు.

1225
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles