చిత్ర‌ల‌హ‌రి టీంని అభినందించిన ప‌వ‌న్ కళ్యాణ్‌

Wed,April 17, 2019 11:27 AM
Power Star PawanKalyan appreciated  Chitralahari team

వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్‌కి కొంత ఊర‌ట‌నిచ్చిన చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఫీల్ ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. విజయ్ పాత్రలో సాయితేజ్ పరిణితితో కూడిన నటనను ప్రదర్శించాడు. గత చిత్రాలకు పూర్తిభిన్నంగా సెటిల్డ్ ప‌ర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. సంఘర్షణతో కూడిన స్ఫూర్తివంతమైన పాత్రలో మెప్పించాడు. ఇక కథానాయికలు కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ తమ పరిధుల మేరకు నటించారు. పోసాని కృష్ణమురళి, రావురమేష్, వెన్నెల కిషోర్, సునీల్ తమదైన శైలిలో మెప్పించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం బాగుంది. మొత్తానికి ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్ర యూనిట్‌కి అభినంద‌నలు తెలిపారు. నిజంగా ఈ చిత్రాన్ని నేను చాలా ఎంజాయ్ చేసాన‌ని ప‌వ‌న్ అన్నారు.2150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles