మ‌రోసారి తెర‌పైకి ప్ర‌భాస్, అనుష్క‌ల పెళ్ళి మేట‌ర్

Thu,October 18, 2018 07:17 AM
Prabhas and Anushka Shetty Met In Italy

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్ వివాహంపై కొన్నాళ్ళుగా ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చర్చ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అనుష్క శెట్టితో ప్ర‌భాస్ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కొంద‌రు ప్ర‌చారం చేయగా, మరి కొంద‌రు ఆంధ్రా అమ్మాయిని వివాహం చేసుకుంటాడ‌ని అన్నారు. ప్ర‌భాస్ పెళ్ళికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఎన్నో పుకార్లు షికారు చేయ‌గా, వీటిని ప్ర‌భాస్ కుటుంబ స‌భ్యులు ఖండించారు. అయితే ఇప్పుడు ప్ర‌భాస్‌, అనుష్క‌ల పెళ్లి మేట‌ర్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తాము మొద‌టి నుండి స్నేహితుల‌మ‌నే చెబుతున్న కూడా ప్ర‌భాస్‌, అనుష్క‌ల పెళ్లికి సంబంధించిన వార్త‌ల‌కి బ్రేక్ అనేదే ప‌డ‌డం లేదు. కొన్నాళ్ళు సినిమాల‌కి దూరంగా ఉంటున్న అనుష్క రీసెంట్‌గా ఇట‌లీ వెళ్ళింద‌ని, అక్క‌డ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌ని క‌లిసింద‌నే ఓ వార్త బ‌య‌ట‌కి వ‌చ్చింది. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజు ఇద్దరు క‌లిసి అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. జాతీయ మీడియా సైతం అనుష్క ఇట‌లీ ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. అక్టోబ‌ర్ 23న ఇట‌లీలో వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుంద‌ని పేర్కొంది. మ‌రి బాహుబ‌లి జంట ఒక్క‌టి కానున్నార‌ని వ‌స్తున్న ఈ ఊహాగానాల‌లో నిజ‌మెంత ఉందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

5682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles