ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఓపిక ఎక్కువ : సుజీత్

Sun,August 18, 2019 09:22 PM
Prabhas Fans Have more patience says saaho director sujeeth


హైదరాబాద్ : ఫ్యాన్స్ చాలా మందికి ఉంటారు..కానీ, ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఓపిక ఎక్కువని.. అందుకే సాహో చిత్రంలో ‘వారంతా డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ అనే డైలాగ్ రాశానని సాహో డైరెక్టర్ సుజీత్ అన్నాడు. ఇవాళ హైదరాబాద్ లో సాహో ప్రీరిలీజ్ వేడుక జరిగింది.

ఈ వేడుకలో సుజీత్ మాట్లాడుతూ..అభిమానులు బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి సినిమా రావాలనుకుంటారు. కానీ..రెండేళ్లు చాలా ఓపిగ్గా వెయిట్ చేసిన ఆయన అభిమానులకు ధన్యవాదాలు.
రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ తో సినిమా చేయడమంటే సముద్రానికి ఎదురు ఈదడమే. కానీ ప్రభాస్‌ నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను ప్రోత్సహించారు. మదిగారు, సాబూ శిరిల్‌ సర్‌, కమల్‌ కణ్ణన్‌ సర్‌, జిబ్రాన్‌ ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు. జిబ్రాన్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాహోకు ఎంతో బలం. చివరి 30 నిమిషాలు విజువల్స్‌, బ్యాక్ గ్రౌండ్ మైండ్‌ బ్లోయింగ్‌ గా ఉంటుంది. నిర్మాతలుగా నన్ను ఎంతో ప్రోత్సహించిన వంశీ, ప్రమోద్‌ అన్నలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సుజీత్ చెప్పాడు.

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles