‘సైరా’తో బాహుబలి..ఫొటో వైరల్

Tue,August 20, 2019 07:37 PM
Prabhas pic with chiru, ramcharan


సైరా నరసింహారెడ్డి, బాహుబలి ఒక్కచోట కలిసి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ ను ఇవాళ ముంబైలో గ్రాండ్ గా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభాస్ సాహో ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలోనే బిజీబిజీగా ఉన్నాడు. టీజర్ విడుదల నేపథ్యంలో ప్రభాస్, చిరంజీవిని కలిశాడు. ప్రభాస్, రాంచరణ్, చిరుతో కలిసి దిగిన ఫొటో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ప్రభాస్, శ్రద్దకపూర్ కాంబినేషన్ లో వస్తోన్న సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందురానుంది. సైరా నరసింహారెడ్డి అక్టోబర్ లో థియేటర్లలో సందడి చేయనుంది.

1767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles