సాహో స్టోరీలైన్ లీక్.. షాక్‌లో ఫ్యాన్స్

Thu,August 29, 2019 01:44 PM

హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సాహో చిత్రం రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్, ట్రైల‌ర్, మేకింగ్ వీడియోస్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచారు మేకర్స్‌. ఈ క్ర‌మంలో సినిమా టిక్కెట్స్ కోసం థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బారులు తీరారు ప్రేక్ష‌కులు. సాహో చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానుల‌ని అయోమ‌యానికి గురి చేస్తుంది.


సాహో చిత్రం స్టోరీ లైన్ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. సాహో సినిమా మొత్తం రెండు వేల కోట్ల దొంగ‌త‌నం చుట్టూనే న‌డవ‌నుండ‌గా, దొంగ‌త‌నం చేసిన వ్య‌క్తిని ప‌ట్టుకునేందుకు అశోక్ చ‌క్ర‌వ‌ర్తి( ప్ర‌భాస్‌) రంగంలోకి దిగుతాడ‌ట‌. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే ప్ర‌భాస్ పోలీస్‌గాను, దొంగ‌గాను క‌నిపిస్తాడ‌ట‌. ఈ రెండు వేరియేష‌న్స్‌ని ద‌ర్శ‌కుడు చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తాడు. ఇక ప్రభాస్ తండ్రి ఓ శాస్త్రవేత్త అని అత‌ను అధునాతన జెట్‌ ప్యాక్‌ను సృష్టిస్తాడని అంటున్నారు.

దొంగ‌త‌నానికి సంబంధించిన ర‌హ‌స్యాలు ఓ బ్లాక్ బాక్స్‌లో ఉంటాయ‌ని చెబుతుండ‌గా, ఆ ర‌హ‌స్యాన్ని ఎలా చేధించారు అనేది మిగ‌తా సినిమా స్టోరీ అని చెబుతున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో ప్ర‌భాస్‌ని అపార్ధం చేసుకున్న శ్ర‌ద్ధా త‌ర్వాత అత‌ని ప్రేమ‌లో ప‌డుతుంద‌ట‌. ఇలా ప‌లు రకాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా ,ఈ వార్త‌లలో ఎంత నిజం ఉంద‌నేది తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

4062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles