పెళ్లి వార్తలపై ప్రశ్న..స్పందించిన ప్రభాస్

Tue,August 13, 2019 08:15 PM
prabhas reacts on his marriage news


టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్ నటిస్తోన్న సాహో చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రద్దాకపూర్, ప్రభాస్ అండ్ టీం సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. సినిమా విడుదల నేపథ్యంలో మీడియాకు ఇంటర్క్యూలు ఇస్తున్నాడు ప్రభాస్.

జాతీయ మీడియాతో మాట్లాడిన సమయంలో ప్రభాస్ ను పెళ్లి విషయమై ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు ప్రభాస్. తాను అనుష్కతో డేటింగ్ లో ఉన్నట్లుగా వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదన్నాడు. సాహో తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రాజెక్టును చేయనున్నాడు. ప్రభాస్ పెళ్లి విషయంపై గతంలో కూడా చాలా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

3834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles