ఎలాంటి కటింగ్స్ లేకుండా సాహో సెన్సార్

Thu,August 29, 2019 05:11 PM

ముంబై: ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా సాహో. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా కావడంతో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 30న విడుదల కానున్న ఈ సినిమా హిందీ వెర్షన్ నేడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెర్టిఫికేషన్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అది కూడా సినిమాలో ఎలాంటి సన్నివేశాలు తొలగించకుండా. తమిళ, తెలుగు వెర్షన్లు వారం రోజుల ముందుగానే సెన్సార్ పూర్తి చేసుకుంది.


ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, చుంకీ పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఐ-మ్యాక్స్ కెమెరాతో షూట్ చేయగా, ఐ-మ్యాక్స్ ఫార్మాట్‌లోనే రెగులర్ 2డీ ఫార్మాట్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమాకు ముందు ధూమ్-3, గోల్డ్, 2.0 ఐ-మ్యాక్స్ ఫార్మాట్‌లోనే విడుదలయ్యాయి. ఇప్పటికే రిలీజైన సాహో ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా మాట్లాడుతూ.. నేను ప్రయోగాత్మక సినిమాల్లో నటించడానికి ఎప్పుడూ ముందుంటాను. ఈ సినిమా హిట్ అయినా కాకపోయినా విభిన్న పాత్రలు చేయడానికి వెనుకాడను. ప్రభాస్‌తో నటించడం మంచి అనుభవమని ఈ సందర్భంగా శ్రద్ధా అన్నారు.

1687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles