`వెంకీమామ` విలన్ ఎవరో తెలుసా..?

Mon,May 27, 2019 06:47 PM
Prateek Jain to debut in Telugu With Venkymama


విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో `వెంకీమామ‌` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కె.ఎస్‌.ర‌వీంద్ర‌ (బాబీ)దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ మోడల్, మిస్లర్ ఇండియా-2014 ప్రతీక్ జైన్ ఈ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాక్. వెంకీ మామలో ప్రతీక్ జైన్ విలన్ గా కనిపించనున్నాడట. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై డి.సురేష్ బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ద‌స‌రా కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ జమ్మూకశ్మీర్ లో జరుగుతుండగా..ప్రతీక్ జైన్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

4340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles