పదిమంది ఉండగా ‘ప్రతి రోజు పండగే’ టైటిల్ సాంగ్

Mon,November 4, 2019 06:47 PM


సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. మారుతి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ‘పది మంది ఉండగా ప్రతి రోజు పండగే..పడి నవ్వుతుండగా ప్రతి రోజు పండగే’ అంటూ సాగే టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. అంతా ఉమ్మడిగా కలిసుంటే ప్రతీ రోజూ పండగలా ఉంటుందనే సందేశంతో ఉన్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ కి జోడీగా రాశి ఖన్నా నటించింది. ప్ర‌తిరోజూ పండగే చిత్రాన్ని డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌నున్నారు.

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles