మెగా హీరో మూవీ షూటింగ్ పూర్తి.. డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌

Thu,November 14, 2019 08:19 AM

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ రీసెంట్‌గా పూర్తైంది. వీలైనంత త్వ‌ర‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని పూర్తి చేసి డిసెంబ‌ర్ 20న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తైన సంద‌ర్భంగా యూనిట్ అంతా కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు. మారుతి కేక్‌ని స‌త్య‌రాజ్‌కి తినిపించారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన సాంగ్స్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ కి జోడీగా రాశి ఖన్నా నటించింది.

915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles