ర‌వితేజకి పోటీగా మెగా హీరో చిత్రం

Thu,October 17, 2019 09:34 AM

సంక్రాంతికి బ‌డా హీరోల సినిమాలు వ‌రుస పెట్టి థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో క్రిస్మ‌స్‌ని టార్గెట్ చేస్తూ మ‌రి కొంద‌రు హీరోలు పోటీ ప‌డేందుకు సిద్ధ‌ప‌డ్డారు. డిసెంబ‌ర్ 20న ర‌వితేజ తాజా చిత్రం డిస్కోరాజా విడుద‌ల కానుంది. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రోవైపు అదే రోజు బాల‌య్య రూల‌ర్ కూడా విడుద‌ల కానుంది. కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్‌గా, గ్యాంగ్ స్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.


ఇప్ప‌టికే డిసెంబ‌ర్ 20న రెండు పెద్ద సినిమాలు పోటీ ప‌డేందుకు సిద్ధం కాగా, వీరికి మ‌రింత పోటినిచ్చేందుకు మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సిద్ధ‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ప్ర‌తిరోజూ పండగే చిత్రాన్ని డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాశి ఖన్నా మరో మారు ధరమ్ తేజ్ కి జంటగా నటించింది. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ మూడు చిత్రాల‌పై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉండ‌గా, ఏ చిత్రం అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందుతుందో చూడాలి.

2393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles