ర‌వీనా టాండ‌న్ చీర‌కొంగు నోటితో ప‌ట్టుకొని చిందేసిన ప్ర‌భాస్

Thu,August 22, 2019 09:36 AM
prbhas dance with raveena

బాహుబ‌లి త‌ర్వాత నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్ త‌న తాజా చిత్రం సాహోని భారీ రేంజ్‌లో ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా హిందీలో ప్ర‌ముఖ టీవీ రియాలిటీ షోస్ అన్నింటికి హాజ‌రై త‌న సినిమాకి సంబంధించిన విష‌యాలు షేర్ చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నచ్‌ బలియే 9’ డ్యాన్స్‌ రియాల్టీ షోలో పాల్గొన్నారు ప్ర‌భాస్‌. షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి రవీనా టాండన్‌ చీర కొంగును నోటితో పట్టుకుని.. ‘కిక్‌’ సినిమాలోని ‘జుమ్మేకీ రాత్‌ హై..’ పాటకు స్టెప్పులు వేశారు ప్ర‌భాస్‌. వాటికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్ల‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌భాస్‌.. క‌పిల్ శ‌ర్మ షోలోను శ్ర‌ద్ధాతో క‌లిసి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. సాహో చిత్రం ఆగ‌స్ట్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇందులో ప్ర‌ముఖ‌ బాలీవుడ్ స్టార్స్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. హాలీవుడ్ స్టంట్స్‌మేన్ చిత్రానికి ప‌నిచేశారు.

4022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles