అమీ జాక్స‌న్ ఎంగేజ్‌మెంట్ స్వీట్ మెమొరీస్

Tue,May 7, 2019 08:59 AM

ఎవడు, ఐ, 2.0 వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అమీ జాక్స‌న్ ఈ ఏడాది మార్చిలో తాను గ‌ర్భవ‌తిని అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో కొన్నాళ్ళ నుండి డేటింగ్‌లో ఉన్న ఈ అమ్మ‌డు స‌డెన్‌గా తాను గ‌ర్భ‌వ‌తిని అంటూ అంద‌రికి షాక్ ఇచ్చింది. అక్టోబ‌ర్‌లో తాను బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వబోతున్న‌ట్టు కూడా తెలిపింది అమీ. అయితే రీసెంట్‌గా అమీ, జార్జ్ లండ‌న్‌లో ఎంగేజ్‌మెంట్ వేడుక జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు హాజ‌ర‌య్యారు. వేడుక‌లో అమీ, జార్జ్ క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.


త‌న ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోల‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అమీ .. న‌మ్మ‌శ‌క్యంగా ఉంది. మా ఎంగేజ్‌మెంట్ అయింది. ఈవెంట్‌ని స్పెష‌ల్‌గా మార్చిన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ అంద‌రికి థ్యాంక్స్ అని తెలిపింది. నా ఎంగేజ్‌మెంట్ స్వీట్ మెమొరీస్ అంటూ మ‌రి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది. రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2020లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. బ్రిటన్‌కు చెందిన జార్జ్ ఓ కుబేరుడు. హిల్టన్, పార్క్ ప్లాజా, డబుల్ ట్రీలాంటి లగ్జరీ హోటల్స్‌ను అతడు నిర్వహిస్తున్నాడు. ఇటు మద్రాసు పట్టణం మూవీతో తెరంగేట్రం చేసిన అమీ జాక్సన్.. తర్వాత హిందీ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్‌లో అక్షయ్ సరసన సింగ్ ఈజ్ బ్లింగ్, నవాజుద్దీన్‌తో కలిసి ఫ్రీకీ అలీ సినిమాల్లో పని చేసింది. చివరిగా శంకర్ 2.0 మూవీలో రజనీకాంత్ పక్కన నటించింది. అమీ నటించిన కిక్ 2 మూవీ విడుదలకు సిద్ధమవుతున్నది.


1778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles