మ‌రోసారి వార్త‌లలో నిలిచిన ప్రియా ప్రకాశ్ వారియ‌ర్‌

Thu,December 13, 2018 11:57 AM

క‌న్నుగీటితో కోట్లాది హృద‌యాల‌ని కొల్ల‌గొట్టిన మ‌ల‌యాళీ భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ‘ఒరు అదార్ లవ్‌’ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ అనే పాటలో ప్రియా హావభావాల‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా కావ‌డంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్ అందుకుంది. ప్రియా ప్ర‌కాశ్ ఎక్స్‌ప్రెష‌న్స్‌కి సెల‌బ్రిటీలు కూడా ఎంత‌గా ఫిదా అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి అంత‌గా ఆక‌ట్టుకున్న ప్రియా ప్ర‌కాశ్ గురించి నెటిజ‌న్స్ గూగుల్‌లో బాగా సెర్చ్ చేశార‌ట‌. దీంతో ఆమె గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన భారతీయ సెలబ్రిటీగా మొదటి స్థానం సంపాదించుకున్నారు. రెండో స్థానంలో ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నా చౌదరి ఉన్నారు. మూడో స్థానంలో బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహూజా, నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు. ఇక సినిమాల విషయానికొస్తే గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన సినిమా ‘2.ఓ’, ‘బాఘి 2’, ‘రేస్‌ 3’. క్రీడల్లో ఫిఫా వరల్డ్‌ కప్‌, ఐపీఎల్‌ గురించి సెర్చ్‌ చేశారు. వీటితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అయిన సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విగ్రహం గురించి కూడా గూగుల్‌లో బాగా వెతికిన‌ట్టు తెలుస్తుంది.

3094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles