ప్రియా ప్ర‌కాశ్ ఖాతాలో మ‌రో బాలీవుడ్ చిత్రం..!

Sun,April 28, 2019 08:26 AM

ప్రియా ప్రకాశ్ వారియ‌ర్.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కేవ‌లం క‌న్నుగీటుతోనే దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందింది. ఆమె పేరు చెబితే కుర్రాళ్ళ గుండెల్లో రైళ్ళు ప‌రిగెడుతుంటాయి. ఒరు ఆదార్ ల‌వ్ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన ప్రియా ప్ర‌కాశ్ త్వ‌ర‌లో శ్రీదేవి బంగ్లా అనే బాలీవుడ్ చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీ కూడా మంచి హిట్ అవుతుంద‌నే భావ‌న‌లో మేక‌ర్స్ ఉన్నారు. అయితే ప్రియాకి మ‌రో బాలీవుడ్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని తాజా స‌మాచారం. మయాంక్ ప్రకాశ్ శ్రీవాత్సవ దర్శకత్వంలో 'లవ్ హ్యాకర్స్' అనే సినిమా రూపొందుతుండ‌గా, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో ప్రియా ప్ర‌కాశ్‌ని ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశార‌ట‌. దీంతో ఈ అమ్మ‌డు తెగ సంతోష‌ప‌డుతుంద‌ట‌. ఢిల్లీ .. లక్నో .. గుర్గావ్ .. ముంబైలలో ఈ సినిమా షూటింగు జరగ‌నున్నట్టు స‌మాచారం. మొత్తానికి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఒక‌వైపు చేతినిండా సినిమాలతో పాటుగా, యాడ్ ఫిలింస్, ప్రాడక్ట్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా ఉంటుంది.

1404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles