మళ్లీ ట్రెండింగ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈసారి ఎందుకో తెలుసా?

Fri,February 8, 2019 07:28 PM

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒక్కసారి కన్నుకొట్టి.. తన చేతి గన్‌తో పేల్చి కుర్రకారు గుండెల్లో సునామీలు సృష్టించింది. నేటి కుర్రాళ్లంతా ప్రియా కన్నుకొట్టుడుకు ఫిదా అయిపోయారు. రాత్రికి రాత్రే స్టార్ అయిన ప్రియా ప్రకాశ్ వారియర్.. అప్పట్లో పెద్ద సంచలనం. మలయాళం సినిమా ఒరు ఆదార్ లవ్‌లోని ఓ పాటలో ఉన్న చిన్న క్లిప్పే.. అప్పట్లో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ప్రియా ప్రకాశ్ దిశ, దశ మారిపోయింది. ఇప్పుడు తను ఓ స్టార్. తనకు సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తోంది. అయితే.. తనను స్టార్ చేసిన మూవీ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఒరు ఆదార్ లవ్.. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.


అయితే.. ఈ సందర్భంగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఆ టీజర్‌లో ప్రియా, హీరో మధ్య కిస్ సీన్ ఉంటుంది. ఆ కిస్ సీన్‌పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌కు వెళ్లే వయసులో ఈ కిస్సుల గోలేందిరా బాబు. కిస్సును హైలెట్ చేసినంత మాత్రాన సినిమా హిట్టవ్వదు. సినిమాలో కంటెంట్ ఉండాలి భయ్యా. స్కూల్ వయసు పిల్లలతో కిస్ సీన్లు చేయించి.. ఏం సాధిస్తారు. ఇదేనా మీరు నేటి యూత్‌కు చెప్పదలుచుకున్నది. ఇటువంటి సీన్లను సినిమాలో నుంచి తీసేయాలి.. అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అప్పుడు కన్నుకొట్టి పాజిటివ్‌గా వైరలయిన ప్రియా.. ఇప్పుడు కిస్ సీన్‌తో నెగెటివ్‌గా వైరలవుతోంది. చూద్దాం మరి.. దీనిపై సినిమా యూనిట్ కానీ.. ప్రియా కానీ ఏవిధంగా స్పందిస్తారో?


2234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles