ఫోర్బ్స్‌ లిస్టులో స్థానం కోల్పోయిన ప్రియాంక, దీపిక

Sun,August 25, 2019 01:27 PM
priyanka chopra and deepika lose their forbs rank

అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న స్కార్లెట్‌ జొహన్సాన్‌
న్యూఢిల్లీ: గత సంవత్సరం ఫోర్బ్స్‌ మేగజైన్‌ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో టాప్‌-100లో స్థానం దక్కించుకున్న ప్రియాంక చోప్రా, ఈఏడాది తన స్థానాన్ని కోల్పోయింది. 2016సంవత్సరంలో అధిక ఆదాయం ఆర్జిస్తున్న నటీమణుల్లో టాప్‌10లో చోటు దక్కించుకున్న దీపికా పడుకోన్‌ గత సంవత్సరం నుంచి ఫోర్బ్స్‌లో స్థానం కోల్పోయింది.

హాలీవుడ్‌ నటి స్కార్లెట్‌ జొహన్సన్‌ 56 మిలియన్‌ డాలర్లతో టాప్‌ పొజిషన్‌ను ఆక్రమించింది. గతేడాది సైతం ఆమె మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌తో టై అప్‌ అయి చాలా సినిమాల్లో నటించింది. అవెంజర్స్‌ మూవీతో ఆమె భారీ లాభాలు ఆర్జించినట్లు హాలీవుడ్‌ టాక్‌. అవేంజర్స్‌ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
రెండో స్థానంలో సోఫియా వెర్గరా 44.1 మిలియన్‌ డాలర్ల ఆర్జనతో రెండో స్థానంలో ఉంది. రీత్‌ విత్‌ర్‌స్పూన్‌ 35మిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో ఉండగా, టాప్‌ టెన్‌లో మొత్తం హాలీవుడ్‌ హీరోయిన్లే ఉండడం గమనర్హం.
నిరుడు విడుదల చేసిన ర్యాంకుల్లో టాప్‌ 100లో శక్తి వంతమైన మహిళల్లో ఉన్న ప్రియాంక చోప్రా తన స్థానాన్ని కోల్పోయింది.

కాగా, 2016సంవత్సరానికి గానూ అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న టాప్‌ హీరోలను సైతం వెనక్కి నెట్టి టాప్‌10 పొజిషన్‌లో ఉన్న దీపికా గత సంవత్సరం నుంచి తన స్థానాన్ని కోల్పోతూ వస్తోంది. ఈ మధ్యే ఫోర్బ్స్‌ విడుదల చేసిన అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న నటుల్లో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

1093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles