మేన‌కోడ‌లితో ఆట‌లాడుకుంటున్న ప్రియాంక చోప్రా

Thu,October 17, 2019 11:52 AM

గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా కొద్ది రోజుల క్రితం యూఎస్ నుండి ఇండియాకి తిరిగి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాను న‌టించిన బాలీవుడ్ చిత్రం ది స్కై ఈజ్ పింక్ చిత్ర ప్రమోష‌న్స్‌లో భాగంగా ఇండియాకి వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీతో స‌ర‌దాగా గడుపుతున్న ప్రియాంక తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో త‌న మేన‌కోడ‌లితో ఆడుకుంటూ.. నువ్వు అందంగా ఉన్నావంటే నువ్వు అందంగా ఉన్నావ‌ని ఒక‌రిపై ఒక‌రు పొగ‌డ్త‌లు కురిపించుకుంటున్నారు. ప్రియాంక చోప్రా షేర్ చేసిన వీడియో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా, ప్రియాంక న‌టించిన ది స్కై ఈజ్ పింక్ చిత్రం గ‌త శుక్రవారం విడుద‌ల కాగా, దీనికి మంచి రివ్యూస్ వ‌చ్చాయి. క‌లెక్ష‌న్స్‌లో మాత్రం బోల్తా ప‌డింది. ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటించారు . ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో క‌నిపించింది. సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందిన‌ ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో జైరా వ‌సీమ్ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టించింది. ప్రియాంక త‌ల్లిగా జ‌రీనా న‌టించింది.


2066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles