ఇంటి కోసం 144 కోట్లు ఖ‌ర్చు పెట్టిన ప్రియాంక చోప్రా

Fri,November 15, 2019 09:08 AM

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2017లో వచ్చిన బేవాచ్ సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన విష‌యం తెలిసిందే. బేవాచ్ త‌ర్వాత కూడా ప‌లు హాలీవుడ్ సినిమాలు చేసిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల స్కై ఈజ్ పింక్ అనే హిందీ చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం ‘వి కెన్ బి హీరోస్’ అనే హాలీవుడ్ మూవీలో న‌టిస్తుంది. అయితే డిసెంబ‌ర్ 1న త‌నక‌న్నా ప‌దేళ్ళు చిన్న‌వాడైన అమెరికన్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని పెళ్ళాడిన ప్రియాంక ఇప్ప‌డు కాపురం పెట్టేందుకు సిద్ధ‌మైంది. అమెరికాలోనే అత్యంత విలాస నగరంగా భావించే లాస్ ఏంజెల్స్ లో 20 వేల చ‌ద‌ర‌పు అడుగులంలో నిర్మించిన‌ కొత్త ఇంటిని కొంద‌ట ప్రియాంక‌. దాని ధర $20మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 144కోట్ల రూపాయలన్న మాట. ఇందులో ఏడు ప‌డ‌క గదులు, 11 స్నాన‌పు గ‌దులు , హై సీలింగ్‌, విశాల ప్ర‌దేశం ఉంటుంద‌ట‌. నిక్ సోద‌రుడు జో జోనాస్ కూడా దాదాపు ఇలాంటి విలాసవంత‌మైన ఇల్లు గ‌తంలో కొన్నాడు. అది 15000 చ‌ద‌ర‌పు అడుగులు ఉండ‌గా, ఇందులో 10 బెడ్ రూంస్‌, 14 బాత్ రూంస్ ఉంటాయ‌ట‌. దీని ధ‌ర $14.1మిలియన్ డాలర్స్‌. ఈ ఇంటికి ద‌గ్గ‌ర‌లోనే ప్రియాంక‌,నిక్‌లు త‌మ కొత్త ఇంటిని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తుంది.

2514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles