ఘ‌నంగా ప్రియాంక-నిక్ వెడ్డింగ్ రిసెప్ష‌న్

Thu,December 20, 2018 11:12 AM
Priyanka Chopra and Nick Jonas Mumbai wedding reception

ఇటీవ‌ల మూడు ముళ్ళ బంధంతో ఒక్క‌టైన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ( ముద్దుగా నిక్యాంక‌)లు డిల్లీలో ఓ రిసెప్ష‌న్ జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. నిన్న సాయంత్రం మీడియా, ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ కోసం మ‌రో రిసెప్ష‌న్ ఏర్పాటు చేసుకున్నారు. స‌బ్య‌సాచి డిజైన్ చేసిన బ్లూ క‌ల‌ర్ క‌స్ట‌మ్ మేడ్ డ్రెస్‌లో ప్రియాంక మెర‌వ‌గా, లైట్ గ్రే క‌ల‌ర్ సూట్‌లో నిక్ జోనాస్ ద‌ర్శ‌నమిచ్చాడు. రిసెప్ష‌న్‌కి వ‌చ్చిన అతిధులు నూత‌న జంట‌కి ఆశీర్వాదం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇత‌నే నా భ‌ర్త అని ప్రియాంక అంద‌రికి ప‌రిచ‌యం చేయడం గ‌మ‌న‌ర్హం. ఇక నిక్ .. భార‌త్ లో నా మొద‌టి షో ఇదే అంటూ చ‌మ‌త్క‌రించారు. వేడుకకు వచ్చిన అతిథులకు, మీడియా ప్రతినిధులకు నిక్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ప్ర‌ముఖ ఫైవ్ స్టార్ హోట‌ల్ తాజ్ ల్యాండ్స్‌లో మ‌రో రిసెప్ష‌న్ జ‌రుపుకోనుండ‌గా, ఈ కార్యక్ర‌మానికి బాలీవుడ్ తారాగ‌ణం మొత్తం త‌ర‌లి రానుంద‌ట‌. పెళ్లి త‌ర్వాత హ‌నీమూన్ కోసం అరేబియ‌న్ దేశాలకి వెళ్ళిన నిక్యాంక జంట ఇటీవ‌లే ఇండియాకి వచ్చిన‌ట్టు తెలుస్తుంది. ప్రియాంక‌, నిక్‌ల వివాహం జోథ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్ భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 2న క్రైస్త‌వ ప‌ద్ద‌తిలో, 3న హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరిరివురి వివాహం జ‌రిగింది.

1802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles