స్ట‌యిలిస్‌మ్యాన్‌కు కిస్ ఇచ్చిన ప్రియాంకా

Mon,December 24, 2018 01:27 PM
Priyanka Chopra gives kiss to most stylish man Nick Jonas

హైద‌రాబాద్: బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్పా.. ఈ మ‌ధ్యే అమెరిక‌న్ పాప్ స్టార్ నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ ఇద్ద‌రూ ఇప్పుడు హ‌నీమూన్ టూర్ల‌తో ఎంజాయ్ చేస్తున్నారు. త‌మ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫోటోల‌తోనూ ఆన్‌లైన్ అభిన‌మాల‌ను థ్రిల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రియాంకా మ‌రో ఫోటోను త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసింది. నిక్‌కు కిస్ ఇస్తూ దానికో క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. స్ట‌యిలిష్ దేవ‌త‌లెప్పుడూ నిక్‌ను దీవించాలంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్న‌ది. నిజానికి నిక్‌కు ఇప్పుడు అమెరికాలో ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది. ఆ దేశానికి చెందిన జీక్యూ మ్యాగ్జిన్ ఇచ్చే మోస్ట్ స్ట‌యిలిస్ మ్యాన్ ఆఫ్ 2018 అవార్డుకు ఎంపిక‌య్యాడు.
స్ట‌యిలిష్ మ్యాన్ రేసులో హాలీవుడ్ హీరో డ్వేయిన్ జాన్స‌న్‌ను వెన‌క్కి నెట్టేస్తూ నిక్ జోన‌స్ టాప్ ప్లేస్ కొట్టేశాడు. స్ట‌యిలిష్ మెన్ కోసం జ‌రిగిన ఓటింగ్‌లో మొత్తం 64 మంది పోటీప‌డ్డారు. వాళ్లంద‌ర్నీ నిక్ ఓడించాడ‌ని జీక్యూ మ్యాగ్జిన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. అభిమానులు నిక్‌కు ఓటేసిన‌ట్లు చెప్పారు. ఈనెల ఒక‌ట‌వ తేదీన ప్రియాంకా, నిక్‌లు.. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భ‌వ‌న్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకున్నారు.

3031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles