సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రియాంక‌-నిక్ పిక్

Wed,December 19, 2018 10:35 AM

నూత‌న జంట ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంప‌త‌లు డిసెంబ‌ర్ 2న క్రైస్త‌వ ప‌ద్ద‌తిలో, 3న హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. జోథ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్ భ‌వ‌న్‌లో వీరి వివాహం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ఆ త‌ర్వాత ఢిల్లీలో రిసెప్ష‌న్ ఏర్పాటు చేసింది ఈ జంట‌. ఈ వేడుకకి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హాజరై నూత‌న వ‌ధూవ‌రుల‌ని ఆశీర్వ‌దించారు. హ‌నీమూన్ కోసం అరేబియ‌న్ దేశాలకి వెళ్లిన నిక్యాంక జంట (నిక్‌, ప్రియాంక జోడీ ముద్దుపేరు) రీసెంట్‌గా ఇండియాకి చేరుకున్న‌ట్టు తెలుస్తుంది . ఈ రోజు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం జుహూలోని జేడ‌బ్ల్యూ మారియ‌ట్ హోట‌ల్‌లో ఈ జంట‌ ఒక రిసెప్ష‌న్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక డిసెంబ‌ర్ 20న ప్ర‌ముఖ ఫైవ్ స్టార్ హోట‌ల్ తాజ్ ల్యాండ్స్‌లో మ‌రో రిసెప్ష‌న్ జ‌రుపుకోనున్నార‌ట‌. దీనికి హిందీ ప‌రిశ్ర‌మ నుండి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. అయితే పెళ్ళికి సంబంధించిన ఫోటోల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ అభిమానుల‌ని అల‌రిస్తుంది ప్రియాంక‌. రీసెంట్‌గా ఉమైద్ ప్యాలెస్ ముందు ప్రియాంక‌, భ‌ర్త నిక్ కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ఫోటోలో ప్రియాంకని నిక్ ఎత్తుకొని ఉండ‌గా,ఆమె చిరుమంద‌హాసంతో కనిపిస్తుంది. ఈ పిక్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.


2418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles