తొలిసారి భ‌ర్త‌తో క‌లిసి ఆడిపాడిన ప్రియాంక చోప్రా

Fri,March 1, 2019 12:06 PM
Priyanka Chopra Makes A Sparkling Debut With Hubby

దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా గ‌త ఏడాది అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రిని చూసిన అభిమానులు జంట చూడ ముచ్చ‌ట‌గా ఉంద‌ని పొగ‌డ్త‌లు కురిపించారు. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా లేదంటే మ్యూజిక్ ఆల్బ‌మ్ అయిన వ‌స్తే బాగుండ‌ని అభిమానులు ఎన్నాళ్ళ‌నుండో క‌ల‌లు కంటూ వ‌స్తున్నారు . వారి క‌ల నిజ‌మైంది. తాజాగా నిక్ జోనాస్ బ్ర‌ద‌ర్ సుకర్ రూపొందించిన వీడియో సాంగ్‌లో నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా క‌లిసి ఆడిపాడారు. జోనాస్ బ్ర‌ద‌ర్స్( జో, కెవిన్‌, నిక్‌) వారి వైఫ్స్( సోఫీ, డానియెల్‌, ప్రియాంక‌) కాంబినేష‌న్‌లో రూపొందిన ఆల్బ‌మ్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ప్రియాంక చోప్రా ఈ వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తొలి సారి మేమందరం క‌లిసి న‌టించాం. షూటింగ్ స‌మయంలో మేము వ‌ర్క్‌లో ఉన్న‌ట్టు అనిపించ‌లేదు. ఫ‌న్ ఫ్యామిలీ ఎఫైర్‌లా అనిపించింది. జోనాస్ బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్స్ సంద‌డి ఓ రేంజ్‌లో ఉంద‌నే కామెంట్ పెట్టింది. ప్రియాంక ప్ర‌స్తుతం ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ అనే హాలీవుడ్ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. ఆమె న‌టిస్తున్న‌ ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అక్టోబ‌ర్ 11,2019న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

3281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles