మరో హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన ప్రియాంక చోప్రా

Sat,April 13, 2019 12:45 PM
Priyanka Chopra to team up with Mindy Kaling

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో దుమ్ము రేపుతుంది. కేవలం నటనతోనే కాదు తన అంద చందాలతోను యూత్ కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ముందుగా హాలీవుడ్ లో క్వాంటికో అనే సీరియల్ తో పాటు బేవాచ్ అనే చిత్రం చేసింది ప్రియాంక‌. ఆ త‌ర్వాత ‘ట్రాన్స్‌పరెంట్‌’ సిరీస్‌ చిత్రాల దర్శకుడు సిలాస్‌ హోవర్డ్‌ దర్శకత్వంలో ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్’ అనే చిత్రం చేసింది ప్రియాంక‌. ఇక తాజాగా ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ అనే హాలీవుడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది . ఇక ఆమె న‌టిస్తున్న‌ ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే బాలీవుడ్ చిత్రం అక్టోబ‌ర్ 11,2019న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ప్రియాంక మ‌రో హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన‌ట్టు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.

భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగే వివాహం నేప‌థ్యంలో ప్రియాంక హాలీవుడ్ చిత్రం తెర‌కెక్క‌నుంది. వివిధ సంస్కృతి, సంప్ర‌దాయాల వ‌ల‌న పెళ్ళిలో వ‌చ్చే గొడ‌వ‌లని బేస్ చేసుకొని కామెడీగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నార‌ట‌. యూనివ‌ర్స‌ల్ స్టూడియో చిత్ర రైట్స్‌ని ద‌క్కించుకుంది. మైండీ క‌లింగ్‌, డాన్ గూర్ చిత్రానికి ప‌ని చేస్తుండ‌గా, వారితో క‌లిసి దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్రియాంక‌. గూర్‌తో క‌లిసి క‌లింగ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తుండ‌గా, హెద‌ర్ మోరిస్, నిన్న ఆనంద్ అజ్లా చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌గా ప‌ని చేయ‌నున్నారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

1129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles