నిక్యాంక రిసెప్ష‌న్‌లో దీప్‌వీర్ చిందులు

Fri,December 21, 2018 10:23 AM

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ ర‌ణవీర్ సింగ్- దీపికా ప‌దుకొణే, ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్‌లు ఇటీవ‌ల మూడు ముళ్ళ బంధంతో ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు జంట‌ల పెళ్లిళ్ళు గ‌త కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అయ్యాయి. దీప్ వీర్‌ల వివాహం త‌ర్వాత నిక్యాంక‌(ప్రియాంక‌-నిక్‌)ల పెళ్ళిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. ప్రియాంక‌, నిక్‌ల వివాహం జోథ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్ భ‌వ‌న్ వేదిక‌గా ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 2న క్రైస్త‌వ ప‌ద్ద‌తిలో, 3న హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరిరివురి వివాహం జ‌రిగింది. అయితే వివాహం త‌ర్వాత ఢిల్లీలో ఓ రిసెప్ష‌న్ ఏర్పాటు చేసుకున్నారు ప్రియాంక- నిక్ జంట‌. ఈ వేడుక‌కి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌రై వారిరివురిని ఆశీర్వ‌దించారు. ఇక డిసెంబ‌ర్ 19న ముంబైలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, మీడియా కోసం రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు.ఆ కార్య‌క్ర‌మంలో ప్రియాంక త‌న భ‌ర్త‌ని అందరికి ప‌రిచ‌యం చేసింది.


గ‌త రాత్రి బాలీవుడ్ సెల‌బ్రిటీల కోసం ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోట‌ల్‌లో మ‌రో రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి స‌ల్మాన్ ఖాన్, సంజ‌య్ ద‌త్‌, అనుష్క శ‌ర్మ, క‌త్రినా కైఫ్‌, సారా అలీ ఖాన్, విద్యా బాల‌న్‌, నిర్మాత సిద్ధార్ద్ రాయ్ క‌పూర్‌, కార్తీక్ ఆర్య‌న్‌, కాజోల్‌, రేఖ‌, కైరా అద్వానీ, ర‌వీనా టాండ‌న్‌, బాబీ డియోల్‌, అనీల్ క‌పూర్‌, హేమ‌మాల‌నితో పాటు ప‌లువురు వ్యాపార వేత్త‌లు, రాజ‌కీయ ప్ర‌ముఖ‌లు రిసెప్ష‌న్‌కి హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల వివాహం చేసుకున్న ర‌ణ‌వీర్‌సింగ్‌, దీపికా ప‌దుకొణేలు కూడా రిసెప్ష‌న్‌కి హాజ‌రు కాగా, వారు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్రాజెక్ట్ బాజీ రావు మ‌స్తానీ పాపుల‌ర్ సాంగ్ పింగాకి నిక్యాంక‌తో క‌లిసి స్టెప్పులు వేశారు. దిల్ దడ‌క‌నే చిత్రంలోని గ‌ల్ల‌న్ గూడియాన్ సాంగ్‌కి కూడా వీరు చిందులేశారు. ప్ర‌స్తుతం వారి డ్యాన్స్ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.మీరు వాటిపై ఓ లుక్కేయండి.

2722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles