ప్రియాంక-నిక్ జోనాస్ విడాకులు తీసుకోబోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం ?

Sun,March 31, 2019 08:10 AM
priyanka nick ready to take divorce

పెళ్ళై ప‌ట్టుమ‌ని మూడు నెల‌లు అయిందో లేదో అప్పుడు విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యార‌ట ప్రియాంక-నిక్ దంప‌తులు. డిసెంబ‌ర్ 1, 2018న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో ఘ‌నంగా జరిగింది. ఆ త‌ర్వాత హిందూ సంప్రదాయంలోను వేడుక జ‌రిపించారు. దాదాపు నెల రోజుల పాటు వీళ్ళ పెళ్లి టాపిక్ బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక‌- నిక్‌ల పెళ్ళి గురించి రోజుకో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొట్టింది. అయితే త‌న క‌న్న ప‌దేళ్ళు చిన్న‌వాడైన అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతుందంటూ ఓకే! అనే ఆంగ్ల మ్యాగ్‌జైన్ ఓ కథనాన్ని ప్రచురించింది.

సాధారణంగా సెల‌బ్రిటీల మ‌ధ్య బంధం ఎక్కువ రోజులు కొన‌సాగ‌ద‌నే వాస్త‌వం అంద‌రికి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది పెళ్లైన కొన్నాళ్ల‌కి విడాకులు తీసుకొని సింగిల్‌గా ఉంటున్నారు. అయితే ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ల విష‌యానికి వ‌స్తే వీరిరివురు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న‌ట్టు ఇటీవ‌ల బ‌య‌ట‌కి వ‌చ్చిన ఫోటోల‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. రీసెంట్‌గా నిక్ త‌న శ్రీమ‌తికి కారు గిఫ్ట్‌గా ఇవ్వ‌డం, అలానే ప్రియాంక ధ‌రించిన డ్రెస్‌కి నిక్‌.. మూడు హార్ట్ ఎమ్మోజీస్‌తో ఆశ్చ‌ర్య‌పోయే రివ్యూ ఇవ్వ‌డం అది కాస్త ట్రెండింగ్ కావ‌డం జ‌రిగింది. అంతేకాదు రీసెంట్‌గా ఈ జంట వెకేష‌న్ టూర్‌లో స‌ర‌దాగా క‌నిపించారు. మ‌రి వీరిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నార‌ని ఆ పత్రిక ఎందుకు ప్ర‌చురించిందో తెలియాల్సి ఉంది.

ఆంగ్ల మ్యాగ‌జైన్ క‌థ‌నం ప్ర‌కారం.. ప్రియాంక‌, నిక్‌లు ఇప్పుడిప్పుడే ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకుంటున్నార‌ట‌. పని, పార్టీలు వ‌ల‌న ఇద్ద‌రి మ‌ధ్య బేధాప్రియాలు వ‌స్తున్నాయి. ఎంత త్వ‌ర‌గా పెళ్ళి పీట‌లెక్కారో అంతే త్వ‌ర‌గా దిగేందుకు సిద్ద‌మ‌య్యారు. వారి బంధం ఓ దారం ఆధారంగా వేలాడుతోంది. ఆ దారం ఎప్పుడైన తెగే ఛాన్స్ ఉంది. ప్రియాంక త‌న ప‌ట్ల చాలా ఓర్పుగా ఉంటుంద‌ని నిక్ భావించాడు. కాని ప్రియాంక ఈ మ‌ధ్య దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ట‌. పెళ్లి త‌ర్వాత సినిమాలు మాని ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంద‌ని నిక్ ఫ్యామిలీ అనుకున్నారు. కాని ఇప్పుడు 21 ఏళ్ళ యువ‌తిలాగా ఆమె ప్ర‌వ‌ర్తించ‌డం నిక్ కుటుంబ స‌భ్యుల‌కి మింగుడుప‌డ‌డం లేద‌ట‌. దాంతో వారు నిక్‌ను విడాకులు తీసుకోమని కోరుతున్నారు. కొద్ది రోజుల పరిచయంతోనే వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహ‌పూర్వ ఒప్పందం కూడా వారు చేసుకోలేదంటూ ఆ ప‌త్రిక కాస్త మ‌సాలా ద‌ట్టించి క‌థ‌నం రాసింది. మ‌రి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ప్రియాంక కాని లేదంటే నిక్ కాని స్పందించాల్సి ఉంది.

3702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles