నిక్ సోదరులతో ప్రియాంక..ఫొటో వైరల్

Sun,March 31, 2019 05:26 PM
Priyanka pic with Jonas Brothers denies Divorce Rumours


ప్రియాంక-పిక్ కపుల్ పెళ్లైన 3 నెలలకే విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కొన్ని విషయాల్లో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా ప్రియాంక-నిక్ వివాహబంధానికి స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు ఓకే అనే ఇంగ్లీస్ మ్యాగజైన్ తన కథనంలో పేర్కొంది. అయితే తాజాగా ఈ వార్తలను కొట్టిపారేసేలా..ప్రియాంక పోస్ట్ చేసిన ఫొటో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. జోనస్ బ్రదర్స్ నిర్వహించిన కన్సర్ట్ ఈవెంట్ కు ప్రియాంక హాజరైంది. ఈ సందర్భంగా జోనస్ బ్రదర్స్ తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నిక్ సోదరులతో నా మొదటి కార్యక్రమం. అద్బుతంగా జరిగింది. వారితో ఈవెంట్ లో పాల్గొనడం గర్వంగా ఫీలవుతున్నానంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రియాంకా. ప్రియాంక పోస్ట్ చేసిన ఈ ఫొటోతో విడాకుల విషయం అంతా ఒట్టిదేనని స్పష్టమవుతోంది.

ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో జోనస్ బ్రదర్స్ ప్రదర్శనను చాలా ఎంజాయ్ చేసింది ప్రియాంక. ఈ కార్యక్రమానికి నిక్ తల్లి డెనిస్ జోనస్ తో పాటు తండ్రి కూడా హాజరయ్యాడు. మ్యూజికల్ ఈవెంట్ కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసింది ప్రియాంక.


3853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles